సాధారణంగా హోటల్‌కి వెళ్తే వంద లేదా రెండు వందలు పెడితే ఫుల్ మీల్స్ పెడతారు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెస్టారెంట్లో ఒక్కసారి భోజనం చేయాలంటే రూ.40 వేలు సమర్పించుకోవాల్సిందే. అది కూడా యూఎస్‌లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లో. ఇంతకీ ఏంటా మీల్ స్పెషల్. ఎలాంటి వంటకాలు అక్కడ ఉంటాయి. ఏం వడ్డిస్తారు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ మీల్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి. ఇండియన్నే అనే ఇండియన్ రెస్టారెంట్ షికాగోలో ఉంది. ఆ రెస్టారెంట్లో భోజనం చేసిన ఓ యువకుడు తనకు రూ.40 వేల బిల్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బిల్లు రూ.40 వేలు అయినా అది వర్త్ అంటూ చెప్పుకొచ్చాడు. ఫుడ్, సర్వీస్‌కి ఫిదా ఇద్దరు వ్యక్తులకు వెజ్ మీల్‌కి రూ.40 వేలు అయిందని చెప్పుకొచ్చాడు. ఢోక్లా, పానీపూరి, వడ, దాల్ మఖానీ.. ఇలా రకరకాల వంటకాలను అద్భుతంగా వండి తమకు సర్వింగ్ కూడా అద్భుతంగా చేశారన్నారు. మొత్తం 10 రకాల వంటకాలను అద్భుతమైన టేస్ట్‌తో తమకు వడ్డించడం వల్ల రూ.40 వేల బిల్లు అయినా కూడా ఆ ఫుడ్ వర్త్ ఉన్నదే అని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Anushk Sharma (@anushkinusa)