Foul Smell Chicken | ఈరోజుల్లో అంతా ఆన్లైన్ డెలివరీలే. ఇంట్లోనే కూర్చొని కావాల్సినవన్నీ జనాలు ఆర్డర్ చేసుకుంటున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుండటంతో బయటికి షాపునకు వెళ్లి వచ్చే టైమ్ కన్నా తక్కువ టైమ్‌లో ఇంటి వద్దకే సరుకులు వస్తుండటంతో ఆన్లైన్ ఆర్డర్ యాప్స్ మీదనే ఆధారపడుతున్నారు. వాళ్లు డెలివరీ చేసే వస్తువుల నాణ్యతను మాత్రం చాలామంది కస్టమర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ కస్టమర్ ఇలాగే ఆన్లైన్ యాప్ నుంచి చికెన్ ఆర్డర్ చేశాడు. చికెన్ డెలివరీ అయ్యాక దాన్ని మంచిగా మసాలా దట్టించి వండాడు. తీరా తిందామని చూస్తే ఆ చికెన్ కుళ్లిన వాసన వస్తోంది. అన్ని ముక్కలు అలాగే పాచిపోయిన వాసన వస్తుండటంతో ఎంతో ఇష్టంగా వండుకున్న చికెన్ మొత్తాన్ని డస్ట్‌బిన్‌లో పడేశాడు. చికెన్‌తో వచ్చిన కవర్ని గమనిస్తే దాని మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉండటంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. కంజ్యూమర్ కోర్టుకి వెళ్తా వండిన చికెన్‌ను డస్ట్ బిన్లో పడేసి చికెన్ కవర్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అన్నింటిని కలిపి వీడియో తీసి వాటిని యాప్‌కి పంపించి రిపోర్ట్ చేశాడు. దీంతో రిఫండ్ ఇస్తామని యాప్ నిర్వాహకులు వెల్లడించినప్పటికీ.. ఒకవేళ ఆ చికెన్‌ని పొరపాటున తిని ఉంటే ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దాన్ని వండటం కోసం ఎంత టైమ్ వేస్ట్ అయింది. ఎన్ని ఇన్‌గ్రేడియెంట్స్ వేస్ట్ అయ్యాయి.. అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా కాదు కానీ.. తాను దీనిపై కంజ్యూమర్ కోర్టుకి వెళ్తా అని అక్కడే ఫిర్యాదు చేస్తా అని చెప్పుకొచ్చాడు. కాకపోతే తనకు లీగల్‌గా ఈ విషయాలు తెలియవని.. ఎవరైనా నెటిజన్లు దీని గురించి వివరాలు చెప్తే తాను కోర్టులో ఆ యాప్‌పై కేసు ఫైల్ చేస్తా అని మరో వీడియోలో ఆ కస్టమర్ చెప్పుకొచ్చాడు. ఆ కస్టమర్ చికెన్ బాధలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందించారు. బ్రో.. ఎందుకు అంత కష్టం. తిన్నగా చికెన్ షాపునకు వెళ్లి అప్పుడే కోసిన కోడి నుంచి ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటే అయిపోతుండె కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు. అన్ని వస్తువుల కోసం ఆన్లైన్ యాప్స్‌ని నమ్ముకోవద్దు గురూ.. అంటూ కొందరు సలహాలు ఇచ్చారు. మరికొందరు మాత్రం మంచి పనిచేశావు. ఇలాంటి విషయాలను అందరితో పంచుకుంటేనే మరోసారి ఎవ్వరైనా ఇలాంటివి ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nikhil Choudhary (@nnn.nikhil908) View this post on Instagram A post shared by Nikhil Choudhary (@nnn.nikhil908) View this post on Instagram A post shared by Nikhil Choudhary (@nnn.nikhil908)