Truck Overturns on Bolero |ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి అని ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వాలు మొత్తుకున్నా డ్రైవర్స్ మాత్రం వినరు. క్షణాల్లో తమ వాహనాలను ప్రమాదానికి గురి చేసి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కేవలం బొలెరో వాహనం నడిపే డ్రైవర్ అజాగ్రత్త వల్ల పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కూడా బోల్తా పడి లారీ డ్రైవర్‌కి సమస్యలు తీసుకువచ్చింది. ఈ భయానక రోడ్డు ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. సీసీటీవీలో ఈ ఘటన రికార్డు కావడం వల్ల ఎవరి తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందో పోలీసులు గుర్తించగలిగారు. రాంపూర్-నైనిటాల్ హైవేపై ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ తన దారిలో వెళ్తోంది. ఇంతలో లెఫ్ట్ సైడ్ నుంచి బొలెరో యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించింది. అప్పటికే ట్రక్ యూటర్న్ వే దగ్గరికి వచ్చినా కూడా బొలెరో డ్రైవర్.. లారీ ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో లారీ అదుపుతప్పి బొలెరో వాహనం మీద బోల్తాపడింది. దీంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సబ్ డివిజనల్ ఆఫీసర్‌కి చెందిన వాహనం అది. ప్రమాదం జరిగినప్పుడు అందులో డ్రైవర్ మత్రమే ఉన్నాడు. ఆ డ్రైవర్ ప్రమాదం జరగ్గానే స్పాట్లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూశారా.. రోడ్డు మీద ఒక్క సెకన్ కూడా వెయిట్ చేసే ఓపిక లేక జనాలు ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హితువు పలుకుతున్నారు. Truck Overturns And Crushes Bolero, Car Driver Dies On Spot pic.twitter.com/gSu336v856 — NDTV (@ndtv) December 29, 2025