Chicken Leg Piece Samosa | ఎట్టెట్టా.. చికెన్ లెగ్ పీస్ సమోసానా? అసలు లెగ్ పీస్తో సమోసా ఎలా తయారు చేస్తారు అనే డౌట్ మీకు వస్తే ఈ వీడియో చూడాల్సిందే. ఓ స్ట్రీట్ వెండర్ ఈ వెరైటీ వంటకాన్ని అందరికీ రుచి చూపిస్తున్నాడు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చికెన్ లెగ్ పీస్ అంటేనే చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. అందులో సమోస కాంబో అంటే ఇక తిండి ప్రియులు ఆగుతారా? నాన్ వెజ్ ప్రియులు అయితే ఆ రెస్టారెంట్‌కి క్యూ కడుతున్నారట. ఈ సమోసాను ఎలా తయారు చేస్తారో ఆ వీడియోలో స్పష్టంగా చూపించాడు. ఆ వీడియో చూస్తుంటే మాత్రం నోరూరక ఉండదు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సమోసా రీమిక్స్ అంటే ఎలా ఉంటుంది. చికెన్ సమోసా లాలీపాప్.. ఈ పేరు ఎలా ఉంది అంటూ నెటిజన్లు తమకు నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఆ చికెన్ లెగ్ పీస్ సమోసా తినాలని ఉంది. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ప్లీజ్ అంటూ కామెంట్ చేశాడు. అలా ఆ వీడియోను మాత్రం తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇంతకీ ఆ సమోసా ఎక్కడ దొరుకుతుందో మీకేమైనా తెలుసా? View this post on Instagram A post shared by Zalim Singh Zalim 48.4k (@zalim.da.bachaa)