PV Narasimha Rao | త్రినేత్ర.న్యూస్ : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించారు. శాసనసభ భవనంలోని పీవీ లాంజ్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు. పీవీ క్యాలెండర్‌ను కూడా ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఇక హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞాన్ భూమిలో పీవీ నరసింహారావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు పీవీ సేవలను గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో పలు నిర్ణయాలు తీసుకుని, సమాజంలో మరింత ముందుకు సాగుతూ ఆర్థిక రంగంలో దేశం కీలక పాత్ర పోషించడంలో తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ముఖ్యుడని వారు కొనియాడారు.