BRSLP | త్రినేత్ర.న్యూస్ : శాసనసభలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా వీరందరూ కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.