Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోకుల కోసం సింగరేణి డబ్బును విచ్చలవిడిగా వినియోగిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి భవన్ వద్ద అన్ ఫిట్ కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకుండా బయటనే కూర్చోబెట్టడంపై సింగరేణి సిబ్బందిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సింగరేణి అధికారులను కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నారు. విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. సింగరేణికి ప్రభుత్వ బకాయిలు చెల్లించాలి. సింగరేణి డబ్బులతో రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. ఒకవైపు జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం తన సోకుల కోసం సింగరేణి డబ్బులు వాడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై విచారణ చేస్తాం. అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతాం అని హరీశ్‌రావు హెచ్చరించారు. సింగరేణిలో క్యాన్సర్ వచ్చిన వాళ్లను, గుండెకు బైపాస్ సర్జరీ చేసిన వాళ్లను, కాళ్లు కండ్లు లేని వాళ్లను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్‌గా ఉన్నారంటూ ఉద్యోగం చేసుకోమని అంటున్నారు. సర్జరీలతో ఇబ్బందులు పడుతున్నామని తమకు విరమణ ఇవ్వాలని కోరినా కూడా మెడికల్ బోర్డు సభ్యులు అన్‌ఫిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు బోర్డు పెడితే మొదటి సారి 55 మంది వెళ్తే అందులో ఐదుగురిని మాత్రమే.. రెండోసారి 123 మంది వెళ్తే అందులో 23 మందిని మాత్రమే మెడికల్‌గా అన్‌ఫిట్ చేశారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఫుట్ బాల్ మ్యాచుల మీద, నువ్వు ఫుట్ బాల్ మీద పెట్టిన రూ.110 కోట్ల మీద ఎంక్వయిరీ వేసి మిమ్మల్ని బొక్కలో నూకుతం. ఎవని అయ్య సొత్తు అని రూ. 10 కోట్ల సింగరేణి సొమ్ముతో మెస్సీతో ఫుట్ బాల్ ఆడినవ్. సింగరేణిలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. నువ్వు ఫుట్ బాల్ ఆడి ఫోటోలు దిగడానికి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటావు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈరోజు జర్నలిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని రేవంత్ రెడ్డి చెప్పి, ఈరోజు జర్నలిస్టులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు. సింగరేణి భవన్ వద్ద అన్ ఫిట్ కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకుండా బైటనే కూర్చోబెట్టడంపై సింగరేణి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు pic.twitter.com/K8bzqhdyvB — Telugu Scribe (@TeluguScribe) December 27, 2025