Election Code | తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ప్రకటించిన ఎస్ఈసీ
Election Code | తెలంగాణలో గ్రామపంచాయతీల ఎన్నికల పర్వం ముగిసింది. మొత్తం 12702 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడుత ఎన్నికలు ఈ నెల 11న, రెండో విడుత 14న, మూడో విడుత ఎన్నికలు 17వ తేదీన నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.