BRSLP | హైదరాబాద్ : ఈ నెల 19వ తేదీన నిర్వాహించాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం వాయిదా పడింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొననున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.