KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇవాళ్టి వరకు ఒక లెక్క రేపట్నుంచి మరో లెక్క అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.. ఇదేం దద్దమ్మ ప్రభుత్వం.. ఇంత చేతగానీ, నోరులేని ప్రభుత్వం ఉంటే ఎట్ల. ఇది ఒక ప్రభుత్వమా..? ఉన్న వస్త్రానికి పోతే అన్న వస్త్రం పోయినట్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. రెండేండ్ల పాటు మౌనం పాటిస్తూ చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితుల్లోనే బయలేదరి వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడుతాం.. KCR కేంద్రాన్ని నిలదీస్తాం. పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతాం. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతాం. ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఏది..? ప్రభుత్వం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి. మాకు రెండు బాధ్యతలు ఉన్నాయి.. తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండోది ప్రధాన ప్రతిపక్షంగా మా డ్యూటీ మేం చేయాలి. ఏదో తమాషాకు అడ్డం పొడవు కారుకూతలు మాట్లాడి.. కిరికిరి మాటలు మాట్లాడి ఏందో చేస్తామంటే నడవదు. ఇవాళ్టి దాకా ఒక కథ.. రేపట్నుంచి ఇంకో కథ. ఎక్కడిక్కడ తోలు తీస్తాం. ప్రతి విషయంలో ఎండగడుతాం.. సమస్యలపై పోరాడుతామని కేసీఆర్ తేల్చిచెప్పారు. [video width="1920" height="1080" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2025/12/Untitled-design.mp4"][/video]