Telangana | జర్మనీ బృందాన్ని ఆకట్టుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అభివృద్ధి
Telangana | జర్మన్ (Germany) బుండెస్టాగ్ (Bundestag) అంతర్గత వ్యవహారాల కమిటీ చైర్మన్ జోసెఫ్ ఓస్టర్ నేతృత్వంలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల బృందాన్ని కేసీఆర్ (KCR) నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రజాస్వామ్య పురోగతి, పాలన పట్ల దృక్పథం, అభివృద్ధి అంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ బృందంతో సమావేశమైన ఎమ్మెల్సీ (MLC) డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) సమావేశ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రయాణం అంతర్జాతీయంగా విశేష ఆసక్తిని రేకెత్తించిందని చెప్పారు.
A
A Sudheeksha
News | Dec 13, 2025, 3.42 pm IST

















