Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బూతులు మాకు మీకంటే ఎక్కువ వస్తాయి.. కానీ మాకు సంస్కారం ఉంది. ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు హుందాగా నడుచుకో. మంచి పనులు చేసి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను ఎగవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుంది. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్నారు.. రెండేళ్ల నుండి ఒక్కరికైనా ఇచ్చారా..? అని సీఎంను తలసాని నిలదీశారు. జీహెచ్ఎంసీలో డివిజన్ల ఏర్పాటు అంతా గందరగోళంగా ఉంది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. [video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2025/12/WhatsApp-Video-2025-12-27-at-11.46.12.mp4"][/video]