Rs.10 Chai vs Expensive Coffee | ఈరోజుల్లో చాయ్ తాగడం అనేది కామన్. ఏ పని చేస్తున్నా.. మధ్యమధ్యలో కాసింత చాయ్ సిప్ చేస్తే వచ్చే మజాయే వేరు. రోజు కూలి పని చేసే కార్మికులు కావచ్చు.. ఏసీ రూమ్‌లలో కూర్చొని లక్షలు సంపాదించే ఉద్యోగులు కావచ్చు.. వ్యాపారవేత్తలు కావచ్చు.. ఎవరైనా సరే చాయ్, లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. కొందరు రోడ్డు పక్కన చాయ్ బండి వద్ద తాగుతారు. మరికొందరు ఖరీదైన చోట్లకు వెళ్లి అక్కడ తాగుతుంటారు. ఎక్కడ తాగినా అదే కానీ వెళ్లే ప్లేస్‌ని బట్టి ధర ఉంటుంది. తాజాగా ఓ కంపెనీ సీఈవో ఈ చాయ్, కాఫీ విషయంలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన ఎవర్బ్యూటీ కంపెనీ సీఈవో కౌశల్ షా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. స్టార్బుక్స్ కాఫీ పై కవర్ ఫోటో పెట్టి.. నేను 10 రూపాయల చాయ్ మాత్రమే తాగుతా. కానీ.. నా ఎంప్లాయిస్ చూడండి.. ఏం తాగుతున్నారో అంటూ స్టార్బుక్స్ కాఫీ కవర్‌ను చూపిస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. కాఫీ, చాయ్ మీద పెద్ద చర్చే నడుస్తోంది. నువ్వు ఎంట్రీప్రెన్యూర్వి కదా. ఒక కంపెనీ ఓనర్‌వి కూడా. అందుకే రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలుసు. కానీ.. వాళ్లు ఉద్యోగులు. నెల తిరిగే సరికి జీతం వస్తుంది. అందుకే వాళ్లు ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెడుతున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం ఎవరి చాయిస్ వాళ్లది. సీఈవో అయినా.. ఉద్యోగి అయినా వాళ్లకు నచ్చింది చేయడంలో తప్పేముంది. వాళ్లకు నచ్చింది తాగుతారు. వాళ్ల పర్సనల్స్లోకి వెళ్లడం కరెక్ట్ కాదంటూ ఆ సీఈవోకు మొట్టికాయలు వేస్తున్నారు. here as a founder I drink 10rs wali chai and here’s what my employees drink - pic.twitter.com/vXzXMaY1Qn — Kaushal (@_kaushalshah) December 23, 2025