Road Accident | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సాంబేపల్లి వద్ద అయ్యప్ప భక్తులకు చెందిన మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ భక్తులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్ల అయ్యప్ప భక్తుల బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారించారు. భక్తులందరూ శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. శబరిమల నుండి హైదరాబాద్ వస్తున్న అయ్యప్ప భక్తుల బస్సుకు ప్రమాదం అన్నమయ్య జిల్లా సాంబేపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిన మినీ బస్సు ప్రమాదం సమయంలో మినీ బస్సులో 15 మంది భక్తులు.. డ్రైవర్, కొంత మంది భక్తులకు స్వల్ప గాయాలు pic.twitter.com/T7eXQdPpA3 — Telugu Scribe (@TeluguScribe) December 26, 2025