Congress | సింగరేణి గురించి మాట్లాడే అర్హత హరీశ్ రావుకు లేదు
హరీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి నిధులను ఇష్టారాజ్యంగా వినియోగించి, సంస్థపై సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు మోపారని INTUC సెక్రటరీ జనరల్ శ్రీ బి. జనక్ ప్రసాద్ విమర్శించారు. అంతేకాదు , సింగరేణి సొమ్మును సిద్దిపేటకు తరలించి, ఆ నిధులతో అక్కడ స్టేడియం నిర్మించిన విషయాన్ని కార్మికులు, ప్రజలు మరువలేదన్నారు. ఇలాంటి నేపథ్యంతో ఇప్పుడు సింగరేణి మీద, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
a
admin trinethra
News | Dec 29, 2025, 1.40 pm IST















