ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చున్నారంటే... త్రినేత్ర.న్యూస్: బీఆర్ ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చున్నారనేది శాసనసభ సమావేశాల్లో ఎప్పటికీ ఓ ఆసక్తికర ఘటన. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిరాయింపు చట్టం ప్రకారం విచారణ జరుపుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవలే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. వారు బీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా తేల్చిచెప్పారు. అయితే స్పీకర్ తీర్పు ప్రకారం వీరు బీఆర్ ఎస్‌లో నే కొనసాగుతున్నట్లైతే ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన బెంచీల్లో నే కూర్చోవాలి. కానీ అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి లు ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే