Uday Nagaraju | తెలంగాణ వ్యక్తికి బ్రిటన్లో అరుదైన గౌరవం.. కేటీఆర్ అభినందనలు | త్రినేత్ర News
Uday Nagaraju | తెలంగాణ వ్యక్తికి బ్రిటన్లో అరుదైన గౌరవం.. కేటీఆర్ అభినందనలు
హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నియమించబడిన ఉదయ్ నాగరాజును తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఉదయ్ నాగరాజు ప్రస్థానాన్ని కొనియాడారు. ఇంగ్లండ్ రాజు చేతుల మీదుగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయినందుకు హృదయపూర్వక అభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. యూకేలో ఉదయ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం అన్నారు. ఇంకా మరిన్ని విజయాలను భవిష్యత్తులో సాధించాలని కేటీఆర్ కొనియాడారు.