Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. తన పట్ల అదృష్టం తలుపు తడితే త్వరలోనే మంత్రి పదవి వస్తుంది. అప్పటి వరకు వేచి చూస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని గతంలో కోమటిరెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ సారేమో తనకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే త్వరలోనే రేవంత్ రెడ్డి కేబినెట్లో మార్పులు చోటు చేసుకుంటాయని వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. రేవంత్ కేబినెట్ విస్తరణ ఖాయమనే వార్తలకు బలం చేకూరుతుంది. ఇప్పటికే రెండు సార్లు కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 12 మందితో మంత్రివర్గం ఏర్పడింది. ఆ తర్వాత గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ సంఖ్య 15కు చేరింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మొత్తంగా మంత్రుల సంఖ్య 16కు చేరింది. ఇక మిగిలింది రెండు కేబినెట్ బెర్త్‌లే. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒక బెర్త్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే దక్కే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి pic.twitter.com/5mtGWXM9Dv — Telugu Scribe (@TeluguScribe) December 19, 2025