[video width="1280" height="720" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2025/12/WhatsApp-Video-2025-12-29-at-11.56.04-1.mp4"][/video] KCR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి చేరుకుని, రిజిస్టర్లో సంతకం చేశారు. ఆ తర్వాత శాసనసభకు వెళ్లారు. సభలో అడుగు పెట్టిన కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రేవంత్ వాకబు చేశారు. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.