దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మూడు దేశాల టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆ మూడు దేశాలతో వాణిజ్యానికి సంబంధించిన పలు ఒప్పందాలు కుదర్చుకున్నారు. అయితే చివరగా ప్రధాని మోదీ పర్యటించిన ఒమన్ దేశంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఒమన్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ మోదీ మీదికి మళ్లింది. ఎందుకంటే.. ప్రధాని మోదీ తన కుడి చెవికి ఏదో మెరుస్తూ ఉన్న ఒక వస్తువును ధరించారు. అది అచ్చం చూడటానికి చెవి కమ్మలా ఉంది. అదేంటి ప్రధాని మోదీ చెవి కమ్మ పెట్టుకొన్నారా? అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలను వైరల్ చేశారు నెటిజన్లు. అది రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ డివైజ్ ఏంటి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో తన వేషధారణ మార్చారా? అని అంతా అనుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్‌ని కలిసిన సమయంలో ప్రధాని మోదీ చెవికి మెరిసేలా ఏదో ఉన్నట్లు గుర్తించారు. కానీ.. అది ఫ్యాషన్ కోసమో.. మరేదో స్టైల్ కోసమో ధరించింది కాదు. అది చెవి కమ్మ కూడా కాదు. అది ఒక పరికరం. రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ డివైజ్ అంటారు దాన్ని. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు మనకు తెలియని విదేశీ భాషల్లో ఎదుటివారు మాట్లాడినప్పుడు వాళ్లు మాట్లాడిన దాన్ని వెంటనే అనువదించి మన భాషలో చెబుతుంది అన్నమాట. ఒమన్ అధికారిక భాష అరబిక్ కావడంతో, అక్కడి నేతలు ప్రధానితో సంభాషించడాన్ని వెంటనే అనువదించి ప్రధాని మోదీ సులభంగా అర్థం చేసుకునేలా దాన్ని ప్రధాని మోదీ తన చెవికి ధరించారు. దాన్ని ఇంకేదో అనుకొని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద చర్చకు తెరలేపారు. తీరా.. అసలు విషయం తెలిశాక.. అంతేనా? అంటూ నోరెళ్లబెట్టారు.