G RAM G Bill | ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నిరసనల హోరు మధ్య జీ రామ్ జీ బిల్లుకి లోక్ సభ ఆమోదం తెలిపింది. గురువారం నాడు ఈ బిల్లు లోక్ సభలో పాస్ అయింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ( ఎంజీఎన్ఆర్ఈజీఏ) Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA)పేరుతో ఉన్న ఈ స్కీమ్‌కి విక్సిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామిన్) (వీబీ- జీ రామ్ జీ) Viksit Bharat Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin) (VB-G RAM G) Bill బిల్లుగా తీసుకొచ్చారు. ఈ స్కీమ్‌కి పేరు మాత్రమే మార్చడం కాదు.. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు ఉపాధి విషయంలో మరిన్ని అవకాశాలు ఇచ్చేలా, వాళ్లకు మరింత బెనిఫిట్ కలిగేలా ఈ స్కీమ్‌ను కేంద్రం తాజాగా మార్పులు చేసింది. ఈ స్కీమ్‌కి పేరు మార్పు అవసరమా? మహాత్మా గాంధీని అవమానిస్తారా? మహాత్మా గాంధీని మరోసారి హత్య చేస్తున్నారు? అంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్కీమ్‌ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్కీమ్‌ని తీసుకొచ్చిందో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభలో స్పష్టం చేశారు. 2009 ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఈజీఏ స్కీమ్‌కి మహాత్మా గాంధీ పేరును జత చేసి ఆ ఎన్నికల్లో గెలుపు కోసం మహాత్మా గాంధీని వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూసిందని ఆయన దుయ్యబట్టారు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదు ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదని, తర్వాత 2009 ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్‌కి ఓట్ల కోసం బాపు గుర్తుకు వచ్చారని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అసలు ఎంజీఎన్ఈజీఏ స్కీమ్‌ని పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్ సభలో ఎనిమిది గంటలు చర్చ జీ రామ్ జీ బిల్లుపై లోక్ సభలో ఎనిమిది గంటలు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై ఈ స్కీమ్ విషయంలో మండిపడ్డారు. బాపు ఆదర్శాలను కాంగ్రెస్ చంపేసిందన్నారు. ఎన్డీఏ వచ్చాక పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ ద్వారా పక్కా ఇండ్లను నిర్మించి బాపు కన్న కలలను నిజం చేశామని చౌహాన్ తెలిపారు. 125 రోజుల గ్యారెంటీ పని 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్కీమ్‌ని పేరు మార్చడమే కాదు.. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏడాదికి 125 రోజుల గ్యారెంటీ పనిని కల్పించనున్నారు. అలాగే వాళ్లకు రోజుకి కనీస కూలీ లభించేలా ఈ స్కీమ్ చర్యలు తీసుకుంటుంది. ఈ స్కీమ్ అమలు జరిగితే గ్రామాలు స్వశక్తితో అభివృద్ధి చెందాలనే మహాత్మా గాంధీ కల నెరవేరుతుందని కేంద్రం చెబుతోంది.