యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి భారత్‌నే టార్గెట్ చేస్తూ టారిఫ్‌ల మీద టారిఫ్‌లు వేస్తున్నాడు. భారత్‌పై ప్రస్తుతం 50 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. ఇది భారీ టారీఫ్. ఈ నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకోవాలని యూఎస్‌కి చెందిన ముగ్గురు చట్ట సభ సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూఎస్‌లో ఉండే ప్రతినిధుల సభలో వాళ్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో 50 శాతం దిగుమతి సుంకాలు విధించడం చట్టవిరుద్ధం అని, అవి యూఎస్ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని వాళ్లు స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం బాధ్యతారాహిత్యం డెమోక్రటిక్ పార్టీకి చెందిన మార్క్ వీసీ, డెబోరా రాస్, రాజా కృష్ణమూర్తి ఈ ముగ్గురు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల భారత్‌పై 50 శాతం టారిఫ్ వేయడం అనేది ట్రంప్ తీసుకున్న అత్యంత బాధ్యతారాహిత్యమైన నిర్ణయం అని తెలిపారు. అమెరికా ప్రజలపైనే ఎక్కువ భారం ఈ టారిఫ్ వల్ల భారత్‌తో పాటు అమెరికా ప్రజలపైన కూడా ఎక్కువ భారం పడుతుందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్ వల్ల సప్లయి చైన్ దెబ్బతింటుంది. దీని వల్ల యూఎస్‌లో నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతాయి. తద్వారా సామాన్యులపై భారం పడుతుంది. రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యం, భాగస్వామ్యాన్ని దెబ్బ తీసే చర్య అని చట్ట సభ సభ్యుల్లో ఒకరైన రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. యూఎస్‌లోని నార్త్ కరోలినాలో భారత్‌కు చెందిన పలు కంపెనీలు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని, వేల కొద్దీ అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలని డెబోరా గుర్తు చేశారు. ఈ టారిఫ్స్ వల్ల ఆ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నేషనల్ ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకొని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకొని భారత్ తో పాటు బ్రిక్స్‌లో ఉన్న దేశాలన్నింటిపై ఈ టారిఫ్ విధించారు. అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండానే ఏకపక్షంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని రద్దు చేసి రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా టారిఫ్ ఉండాలని అమెరికా పార్లమెంట్‌ను ఈ తీర్మానం కోరింది. ఒకవేళ, ఈ తీర్మానం ఆమోదం పొందితే భారత్‌పై అదనంగా విధించిన టారిఫ్ రద్దు అవుతుంది.