Epstein Files |జెఫ్రీ ఎప్స్టీన్ తెలుసు కదా. వివాదాస్పద ఆర్థికవేత్త. ఆయనకు సంబంధించిన కీలక విషయాలను, రహస్య పత్రాలను, పలు ఫోటోలను తాజాగా ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. 2019 లో ఎప్స్టీన్ జైలులోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసు ఇప్పటికీ ఒక మిస్టరీలాగే ఉండిపోయింది. ఆయన బతికి ఉన్నప్పుడు ఆయనతో కలిసి తిరిగిన ప్రముఖుల గుట్టు రట్టు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను జైలులోనే హత్య చేశారనే ఆరోపణలు ముందునుంచి ఉన్నాయి. ఎప్స్టీన్కి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సన్నిహితుడే. అందుకే.. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే, ఎప్స్టీన్కి సంబంధించిన పలు కీలక ఫోటోలను తాజాగా అమెరికా న్యాయ శాఖ బహిర్గతం చేసింది. ఆ డాక్యుమెంట్లలో ఏముంది? ఎప్స్టీన్ ప్రయాణించిన విమానాల వివరాలు, ఈమెయిల్స్, ఫోటోలు, విచారణ చేసిన సంస్థల రిపోర్టులు ఉన్నాయి. బహిర్గతం చేసిన ఫోటోలలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ లాంటి ప్రముఖులతో కలిసి ఎప్స్టీన్ ఉన్నారు. ఆ ఫోటోలలో ఉన్న బాధితుల వివరాలను మాత్రం యూఎస్ సర్కారు బయటపెట్టకుండా జాగ్రత్త పడింది. పాక్షికంగానే ఫైళ్ల విడుదల నిజానికి ట్రాన్స్పరెన్సీ చట్టం ప్రకారం.. ఎప్స్టీన్ ఫైల్స్‌ను డిసెంబర్ 19 లోపు విడుదల చేయాలి. అందుకే హడావుడిగా ట్రంప్ సర్కారు తాజాగా ఈ ఫైల్స్‌ను విడుదల చేసినా.. అవి పాక్షికంగానే ఉన్నాయని, పూర్తి స్థాయి పారదర్శకత లేదని, కావాలనే ట్రంప్ సర్కారు సమాచారాన్ని దాచిపెడుతోందని డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల గుండెల్లో రైళ్లు ఒక్కసారిగా బయటపడ్డ ఈ ఫైల్స్‌తో పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్స్టీన్ ఎలా చనిపోయారు? జైలులో హత్యకు గురయ్యారా? అసలు ఆయన కేసు ఏమైంది? అనే విషయాలపై మిస్టరీ వీడకున్నా.. ఈ ఫైళ్ల ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రముఖులు టెన్షన్ పడుతున్నారు. త్వరలోనే మరిన్ని ఫైల్స్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో ఎప్స్టీన్తో కనెక్షన్ ఉన్న ప్రముఖులు భుజాలు తడుముకుంటున్నట్లు తెలుస్తోంది. JUST IN: A large portion of the Epstein files have been released, showing photos of Jeffrey Epstein with high-profile associates including former President Bill Clinton. In one photo, Clinton was seen in a hot tub with anonymous female. In another photo, Clinton is seen with… pic.twitter.com/TVlKhI6hYG — Collin Rugg (@CollinRugg) December 19, 2025