Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పరిధిలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. ఉప్పర్‌పల్లిలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 191 వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపైకి డీసీఎం దూసుకెళ్లింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీసీఎం డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ను అబ్దుల్ సత్తార్గా గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దూసుకెళ్లిన డీసీఎం ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్ మృతి.. మరో ఇద్దరికి గాయాలు రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు ప్రమాదం pic.twitter.com/3u8qXjYeP7 — Telugu Scribe (@TeluguScribe) December 23, 2025