Tamannaah | రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ ( Dhurandhar) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ స్పై యాక్షన్ మూవీ రిలీజై పదిహేడు రోజులు దాటినా రోజురోజుకు కలెక్షన్స్ (Collections) పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. వరల్డ్ వైడ్‌గా ఆరు వందల కోట్లకు చేరువలో ఉంది. బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌ఫై వచ్చిన స్పై యాక్షన్ సినిమాలకు భిన్నమైన పాయింట్‌తో దర్శకుడు ఆదిత్య ధర్ ధురంధర్ మూవీని తెరకెక్కించారు. అతడి టేకింగ్‌తో పాటు రణవీర్‌సింగ్, అక్షయ్ ఖన్నా యాక్టింగ్‌కు ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఫిదా అవుతున్నారు. సందీప్ వంగా, ఆర్జీవీ వంటి డైరెక్టర్లతో పాటు అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా ధురంధర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ధురంధర్ జోరు చూస్తుంటే వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ను దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. యాభై మిలియన్ల వ్యూస్ ధురంధర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) నటించాల్సింది. మేకర్స్ ఆమెను అప్రోచ్ కూడా అయ్యారట. కానీ చివరి నిమిషంలో ఈ ఆఫర్ చేజారినట్లు సమాచారం. ఈ సినిమాలోని షరాత్ అనే స్పెషల్ సాంగ్‌లో ఆయేషా ఖాన్‌తో పాటు క్రిస్ల్రే డిసౌజా, జాస్మిన్, మధుబంటి బాగ్చి నటించారు. ఇటీవల మేకర్స్ ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ పెద్ద హిట్టయ్యింది. ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పది రోజుల్లోనే యాభై మూడ మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తమన్నాతో స్పెషల్... షరాత్ సాంగ్ కోసం డైరెక్టర్ ఆదిత్య ధర్ మొదటగా తమన్నాను అనుకున్నారట. మిల్కీ బ్యూటీ కూడా ఈ సాంగ్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. షూటింగ్ మొదలవ్వడానికి కొద్ది రోజుల తమన్నాకు మేకర్స్ షాకిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్ చేయని నటి అయితేనే బాగుంటుందని భావించిన మేకర్స్ తమన్నాను కాదని ఆయేషాఖాన్ను ఛాన్స్ ఇచ్చారట. అలా బ్లాక్‌బస్టర్ మూవీని తమన్నా మిస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌తో తమన్నా చాలానే స్పెషల్ సాంగ్స్ చేసింది. కేజీఎఫ్, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు, రైడ్ 2 సినిమాల్లోని ఐటెంసాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస ఫ్లాపుల కారణంగా కొన్నాళ్లుగా తమన్నా కు ఆఫర్లు తగ్గాయి. ధురంధర్ చేసుంటే ఆమె కెరీర్‌కు హెల్పయిఉండేదని నెటిజన్లు చెబుతున్నారు. రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయాల్సిందట. కానీ చివరి నిమిషంలో ఈ ఆఫర్ మిల్కీ బ్యూటీ నుంచి చేజారినట్లు సమాచారం.