Samantha | అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. టాలీవుడ్లో బెస్ట్ స్పెషల్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఊ అంటావాతోనే కెరీర్లో ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ ఐటెంసాంగ్‌లో హాట్ హాట్‌గా కనిపించి అభిమానులకు పెద్ద షాకిచ్చింది. అప్పట్లో ఈ సాంగ్ గురించి గట్టిగానే డిస్కషన్ నడిచింది. ఊ అంటావా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో సమంతకు చాలానే ఆఫర్లు వచ్చాయి. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేశారు. కానీ స్పెషల్ సాంగ్స్ చేయడానికి సమంత అంగీకరించలేదు. ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదీ కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో. అలియాభట్ హీరోయిన్గా అల్ఫా పేరుతో బాలీవుడ్లో ఓ స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అల్ఫా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమోషనల్ కమ్ స్పెషల్ సాంగ్లా రెండు విధాల ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఈ పాటను షూట్ చేయనున్నారట మేకర్స్. ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సాంగ్‌ను గ్రాండియర్‌గా చిత్రీకరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాటలో సమంతతో పాటు బాలీవుడ్‌కు చెందిన మరికొందరు హీరోయిన్లు కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శుభంతో రీఎంట్రీ... ఇటీవలే శుభం సినిమాతో దాదాపు రెండేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ హారర్ కామెడీ మూవీని స్వయంగా సమంతనే నిర్మించింది. నిర్మాతగా తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ అందుకుంది. శుభం మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం షూటింగ్‌తో బిజీగా ఉంది సమంత. ఈ క్రైమ్ కామెడీ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బేబీ, జబర్ధస్థ్ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తోంది.