Tamannaah | యంగ్ హీరోయిన్ల దూకుడుతో అవకాశాల రేసులో వెనుకబడిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah). కాంపిటీషన్‌కు తోడు వరుస పరాజయాలు తమన్నాకెరీర్ను దెబ్బతీశాయి. హీరోయిన్గా ఆఫర్లు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్‌పై ఫోకస్ పెడుతోంది. మరోవైపు మంచి సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తమన్నా బంపరాఫర్‌ను అందుకుంది. బాలీవుడ్ బయోపిక్‌లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. లెజెండరీ దర్శకనిర్మాత, నటుడు వి శాంతారామ్ జీవితం ఆధారంగా హిందీలో ఓ మూవీ తెరకెక్కుతోంది. వీ శాంతారామ్ పేరుతోనే రూపొందుతున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం అఫీషియల్‌గా ప్రకటించారు. తమన్నా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చీరకట్టులో రెట్రో లుక్‌తో తమన్నా కనిపిస్తోంది. సినిమా షూటింగ్లో వాడే లైట్ ఈ పోస్టర్లో కనిపిస్తోంది. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండో భార్యగా... వీ శాంతారామ్ మూవీలో తమన్నా అలనాటి హీరోయిన్ జయశ్రీ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. శాంతారామ్ సినిమాలతోనే బాలీవుడ్లో ఫేమస్ అయ్యింది జయశ్రీ. శాంతారామ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహానీ, శాకుంతల, దహేజ్తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో షూటింగ్‌లోనే శాంతారామ్, జయశ్రీకి ఏర్పడిన అనుబంధం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. శాంతారామ్‌కు అప్పటికే విమలాబాయితో పెళ్లయ్యింది. ఈ డైరెక్టర్ జీవితంలోకి రెండో భార్యగా జయశ్రీ అడుగుపెట్టింది. శాంతారామ్, జయశ్రీల వివాహం 1941లో జరిగింది. 1956లో విడాకులు తీసుకున్నారు. జయశ్రీ పాత్ర కోసం తమన్నా చాలా రీసెర్చ్ చేసినట్లు చెబుతోన్నారు. దిగ్గజ నటి జీవితాన్ని గురించి తెలుసుకొని నటిస్తోన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. యంగ్ హీరో.... శాంతారామ్ బయోపిక్‌లో టైటిల్ పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ ఛతుర్వేది కనిపించబోతున్నాడు. శాంతారామ్ బయోపిక్కు అభిజీత్ శిరీష్ దేశ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం తమిళంలో అరాణ్మణై 4 తర్వాత సుందర్ సి దర్శకత్వంలో తమన్నా ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విశాల్ హీరోగా కనిపించబోతున్నాడు.