Avatar 3 Review | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్, అవతార్ 2 వరల్డ్ వైడ్‌గా సినీ లవర్స్‌ను మెప్పించాయి. విజువల్స్, గ్రాఫిక్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. అవతార్ సినిమాలకు ఆడియెన్స్ మాత్రమే కాకుండా దిగ్గజ సినీ దర్శకులు కూడా ఫ్యాన్స్‌గా మారారు. అవతార్, అవతార్ 2 సినిమాలు ఇండియాలోనూ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టాయి. తాజాగా అవతార్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూడో పార్ట్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు ముందే అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాను రాజామౌళి, సుకుమార్‌తో పాటు పలువురు టాలీవుడ్ దర్శకులు వీక్షించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు సుకుమార్. పుష్ప డైరెక్టర్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండోర వరల్డ్‌లోకి వెళ్లిపోయా... Avatar: Fire and Ash poster showing a close-up of a Na’vi warrior’s fiery eye, ash-covered face, and intense battle atmosphere సైన్స్ ఫిక్షన్ సినిమాను కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించడం అంటే కష్టమైన విషయమని సుకుమార్ అన్నారు. "మూడు గంటల ఇరవై నిమిషాలు ఎంగేజింగ్‌గా ఉంది. నేను ఒక్కడినే అవతార్ 3 చూశా. కానీ ఒంటరిగా చూశాననే ఫీల్ ఎక్కడ రాలేదు. పండోర వరల్డ్‌లోకి వెళ్లిపోయారు. నా చుట్టూ ఎవరున్నారన్నది గమనించలేదు. పక్కా బ్లాక్బాస్టర్ మూవీ. తెలుగు సినిమాల్లో ఉన్నంత ఎమోషన్ అవతార్ 3లో కనిపించింది. జేక్స్, నెట్రితో ఇతర పాత్రల తాలూకు ఎమోషన్స్‌కు కళ్లల్లో నీళ్లు తిరగాయి. పక్కా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది" అని సుకుమార్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవతార్ 3 మూవీ తొలిరోజు ఇండియాలో 30 - 35 కోట్ల మధ్య ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగు వెర్షన్‌కు మొదటిరోజు ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చునని అంచనా వేస్తున్నారు. 400 మిలియన్లు (ఇండియన్ కరెన్సీలో 3300 కోట్ల) బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. క్వారిచ్ దాడుల నుంచి తమ ఫ్యామిలీని జేక్ సల్లీ, నేట్రి కాపాడుకోవడంతో రెండో పార్ట్ ముగిసింది. అక్కడి నుంచే ఫైర్ అండ్ యాష్ కథ మొదలవుతుంది. యాష్ గ్యాంగ్ దాడుల కారణంగా సల్లీ, నేట్రి కుటుంబం చెల్లచెదురు అవుతుంది. ఆ దాడులను జేక్ సల్లీ, నేట్రి ఎలా ఎదుర్కొన్నారు అనే అంశాలతో మూడో పార్ట్ రూపొందింది.