Indian student killed in Toronto | యూఎస్, కెనడాలో భారతీయులపై, విద్యార్థులపై జరుగుతున్న దాడులు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పలువురు ఇండియన్ స్టూడెంట్స్‌ని దుండుగులు కాల్చి చంపారు. తాజాగా టొరంటో యూనివర్సిటీకి చెందిన స్కార్బరో క్యాంపస్ సమీపంలో 20 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్ శివాంక్ అవస్తీని దుండగులు కాల్చి చంపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో శివాంక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టొరంటో యూనివర్సిటీలో శివాంక్ డాక్టర్‌కి సంబంధించిన కోర్సు చదువుతున్నట్లు తెలుస్తోంది. శివాంక్‌పై కాల్పులు జరిపిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు టొరంటోలో ఈ సంవత్సరంలోనే 41 హత్యలు జరిగాయి. Indian student killed in Toronto |వారంలో రెండో ఘటన ఇటీవలే 30 ఏళ్ల ఇండియన్ మహిళ హిమాన్షి హత్యకు గురయింది. ఆమె డిసెంబర్ 19న కనిపించకుండా పోవడం, ఒక్క రోజు తర్వాత ఓ ఇంట్లో దారుణ హత్యకు గురై కనిపించడం ఎన్ఆర్ఐలను ఆందోళన కలిగిస్తోంది. ఆమె హత్య కేసులో అబ్దుల్ గఫూరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరూ గతంలో సన్నిహితంగా ఉండేవారని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. భారతీయులనే టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఈ దాడులతో కెనడాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, ఎన్ఆర్ఐల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా ఈ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా భారతీయులపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. News Release - Homicide Investigation, Highland Creek Trail and Old Kingston Road, Victim: Shivank Avasthi, 20, Image Releasedhttps://t.co/WdkKqp4pGe pic.twitter.com/XF6NAYJwgX — Toronto Police (@TorontoPolice) December 24, 2025 We express deep anguish over the tragic death of a young Indian doctoral student, Mr. Shivank Avasthi, in a fatal shooting incident near the University of Toronto Scarborough Campus. The Consulate is in touch with the bereaved family during this difficult time, and is extending… — IndiainToronto (@IndiainToronto) December 25, 2025