అసోంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏనుగుల మంద మృతి చెందింది. వేగంగా దూసుకొచ్చిన రాజధాని ఎక్స్ప్రెస్ రైలు అడవి ఏనుగుల మందను ఢీకొట్టింది. దీంతో 8 ఏనుగులు స్పాట్లో మృతి చెందాయి. మరికొన్ని ఏనుగులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం ఎలా జరిగింది? స్థానికులు ఏమంటున్నారంటే.. అటవీ ప్రాంతంలో ఉన్న ట్రాక్ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ రైలు వెళ్తోంది. అదే సమయంలో ఏనుగుల గుంపు రైల్వే పట్టాలను దాటుతోంది. ఆ సమయంలో రైలు స్పీడ్లో ఉంది. దీంతో ఏనుగుల గుంపును బలంగా ఢీకొట్టింది. రైలు వేగంగా ఉండటంతో ఏనుగులు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో.. ఏనుగుల శరీర భాగాలు తునాతునకలయ్యాయి. అక్కడి పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు. ఏనుగుల కారిడార్ అని తెలిసి కూడా ఆ ప్రాంతం ఏనుగుల కారిడార్ అని తెలిసి కూడా రైళ్ల వేగాన్ని తగ్గించకపోవడం ఏంటి అని అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల కారిడార్లలో రైళ్ల వేగాన్ని తగ్గించాలని గతంలో హెచ్చరికలు జారీ చేసినా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.