ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మీషో ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. కంపెనీ గ్రోత్ కోసం పెట్టుబడులను ప్రజల నుంచి ఆహ్వానిస్తోంది. అందుకోసం ఐపీఓను రిలీజ్ చేసింది మీషో. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేదీ. మీషో ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మంచి క్రేజ్ లభిస్తోంది. గ్రే మార్కెట్లో కూడా మీషో స్టాక్‌కి డిమాండ్ పెరుగుతోంది. గురువారం రూ.51 గా ఉన్న ప్రీమియం వాల్యూ.. నేడు రూ.53కి చేరింది. మార్కెట్లో లిస్టు అయ్యే సమయానికి మీషో షేర్ ధర కనీస 50 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మీషో షేర్ ధర రూ.105 నుంచి రూ.111 వరకు బిడ్డింగ్ వేసుకునే అవకాశం ఉంది. కనీసం 135 షేర్లు కొనాలి. దాన్ని ఒక లాట్ అంటారు. ఈరోజే దరఖాస్తుకు చివరి తేదీ కాబట్టి మళ్లీ మార్కెట్లు సోమవారం డిసెంబర్ 8న తెరుచుకుంటాయి కాబట్టి ఆరోజే షేర్ల అలాట్మెంట్ జరగనుంది.