Peddi Movie | రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది కోసం మెగా అభిమానులతో పాటు పాన్ ఇండియన్ వైడ్‌గా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న పెద్ది మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుకున్న డేట్‌కే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని గట్టిగా మేకర్స్ ఫిక్సయ్యారు. షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఢిల్లీ షెడ్యూల్లో పార్లమెంట్ భవన్‌తో పాటు ఇండియా గేట్ వద్ద కొన్ని సీన్లను షూట్ చేశారు. మంగళవారం రోజు ఢిల్లీలోని ఏపీ భవన్ క్యాంటిన్లో రామ్‌చరణ్‌పై బుచ్చిబాబు సానా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 160 మిలియన్ల వ్యూస్ ఏపీ, తెలంగాణ భవన్లో రామ్‌చరణ్ సందడి చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిలో రగ్గ్డ్ లుక్‌లో రామ్‌చరణ్ కనిపిస్తున్నారు. ఢిల్లీ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్‌తో ఓ పాటు సాంగ్‌ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఢిల్లీ షెడ్యూల్ సాగనున్నట్లు సమాచారం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్మాల్ బ్రేక్ ఇచ్చి...నెక్స్ట్ షెడ్యూల్‌ను జనవరి ఫస్ట్ వీక్‌లో మొదలుపెట్టబోతున్నారట. పెద్ది మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 160 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జనవరిలో సెకండ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. పెద్ది మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో పెద్దికి పోటీగా యశ్ టాక్సిక్, రణవీర్‌సింగ్ ధురంధర్ 2, నాని ప్యారడైజ్తో పాటు అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.