Priyanka Chopra | మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి మూవీ వరల్డ్ వైడ్‌గా సినీ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకులు సైతం ఎదురుచూస్తున్నారు. వారణాసి సెట్స్‌ను సందర్శించాలని ఉందంటూ అవతార్ ప్రమోషన్స్‌లో భాగంగా జేమ్స్ కామెరూన్ పేర్కొనడం వారణాసి మూవీపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. హాలీవుడ్ సినిమాలను ఏ మాత్రం తీసిపోని విధంగా టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వారణాసితోనే ఫస్ట్ టైమ్ మహేష్‌బాబు పాన్ ఇండియన్ దాటి పాన్ వరల్డ్ లీగ్‌లోకి అడుగుపెడుతున్నారు. వారణాసి సినిమాతో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెలుగులో తొలి అడుగు వేయబోతుంది. అమెరికన్ పాన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా కొన్నేళ్లుగా హాలీవుడ్‌కు పరిమితమైంది. వారణాసితోనే తిరిగి ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మహేష్‌బాబు, రాజమౌళిలకు ధీటుగానే ఆమె రెమ్యూనరేషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 1300 కోట్ల బడ్జెట్... వారణాసి మూవీని తొలుత ఆరేడు వందల కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ సినిమాపై ఉన్న హైప్, స్టోరీ స్పాన్ తో పాటు రెమ్యూనరేషన్ల కారణంగా బడ్జెట్ రెట్టింపు అయినట్లు సమాచారం. దాదాపు 1300 కోట్లతో వారణాసి రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వారణాసి బడ్జెట్‌పై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్‌కు ప్రియాంక చోప్రా గెస్ట్‌గా హాజరైంది. ఈ షోలో వారణాసి సినిమాకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది ఇన్‌డైరెక్ట్‌గా ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ గురించి కపిల్ శర్మ ఓ ప్రశ్న అడిగాడు. వారణాసి సినిమా 1300 కోట్లతో తెరకెక్కుతుందని విన్నాను. మీరు ఈ సినిమాలోకి హీరోయిన్గా ఎంటరైన తర్వాతే బడ్జెట్ పెరిగిందని అంటున్నారు...నిజమేనా? అంటూ ప్రియాంక చోప్రాను హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అతడి ప్రశ్నకు ఘాటుగానే సమాధానమిచ్చింది ప్రియాంక చోప్రా. నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావు. సినిమా బడ్జెట్లో సగం నా బ్యాంకు అకౌంట్లో జమ అయ్యిందని అనుమానంగా ఉందా? అంటూ సెటైరికల్‌గా బదులిచ్చింది. ప్రియాంక ఆన్సర్ వైరల్ అవుతోంది. వారణాసి మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు 40 శాతానికిపైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 2027లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. వారణాసి మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.